జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదుః చంద్రబాబు

192
Jagan PhoneTo Chandrababu

రేపు మధ్యాహ్నం విజయవాడలోని ఇందిరా ముస్సిపల్ స్టేడియంలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనన్న సంగతి తెలిసిందే. అయితే ఈకార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు జగన్. అయితే జగన్ ప్రమాణస్వీకారానికి తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు చంద్రబాబు.

ఉదయం చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశంలో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు చంద్రబాబును టీడీపీ నేతలు టీడీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబుకు బదులుగా టీడీపీ తరపున ఒక బృందాన్ని పంపించనున్నట్లు సమాచారం. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. తనకు బదులుగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బ‌ృందాన్ని పంపాలని నిర్ణయించారు.