టీడీపీలో మార్పులు..అభ్యర్థుల్లో అలజడి?

15
- Advertisement -

టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా తెలుగు దేశం పార్టీ 141 అసెంబ్లీ స్థానలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా జరిగిపోయింది. అధినేత చంద్రబాబు, లోకేష్.. ఇతర నాయకులు ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన జరిగినప్పటికి కొన్ని స్థానాల్లో మార్పులు చేసేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు తెలుస్తోంది.

సామాజిక సమీకరణాలు, ఆయా నేతల మద్య అసమ్మతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కొన్ని స్థానాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను మార్చబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ టీడీపీ మద్య పొత్తులో భాగంగా కేటాయించిన సీట్ల విషయంలోనే ఈ మార్పులు ఉండబోతున్నాయట. కడప, నర్సాపురం ఎంపీ స్థానాలతో పాటు, ఉండి-జమ్మలమడుగు, వనపర్తి-తంబేర్లపల్లి వంటి స్థానాల్లో టీడీపీ బీజేపీ అభ్యర్థులను మార్చబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మాడుగుల, చింతలపూడి, మడకశిర, సిల్లూరుపేట, సత్యవేడు, వంటి స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులను మార్చానున్నారట అధినేత చంద్రబాబు.

రఘురామ ఎంట్రీతో కలవరం

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా టీడీపీలో చేరారు. గత కొన్నాళ్లుగా ఆయన ఏ పార్టీలో చేరతాడనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. మొదట బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ టీడీపీ వైపే ఆయన మొగ్గు చూపారు. కాగా రఘురామ నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించినప్పటికి బీజేపీ నుంచి ఆ సీటు కేటాయించడంతో టీడీపీ నుంచి ఆయన అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ నియోజక వర్గం ఉండి సీటును రఘురామకు కట్టబెట్టింది టీడీపీ. మొదట ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరును ప్రకటించారు. కానీ ఇప్పుడు రఘురామకు ఆ సీటు కేటాయించడంతో రామరాజు వర్గం ఆందోళనకు దిగింది.

ఇలా అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానం మార్పులకు తెర తీయడంతో ఆల్రెడీ సీటు కన్ఫర్మ్ అయిన నేతల్లో అలజడి మొదలైంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:IPL 2024:అభి’షేక్’.. సేహ్వాగ్ అవుతాడా?

- Advertisement -