ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు మంత్రవర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సీఆర్డీఏ (CRDA) పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన్, అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 2 వేల 778 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్‌లకు టెండర్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది.
Also Read:భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్

