భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్

8
- Advertisement -

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్ – రష్యా మధ్య ఇంధన సరఫరా నేపథ్యంలో ట్రంప్ భారీగా టారిఫ్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అమెరికా టారిఫ్‌ పెంచినా అది భారత్ – రష్యా వాణిజ్య బంధంపై ప్రభావం చూపబోదని.. భారత్‌కు 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది రష్యా.

మాస్కోలో జరిగిన 26వ భారత–రష్యా అంతర్ ప్రభుత్వ వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు సాంస్కృతిక సహకార కమిషన్ (IRIGC-TEC) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్‌తో పాల్గొన్నారు. రష్యా, రక్షణ రంగంలో కూడా భారత్‌కు “ప్రాధాన్య భాగస్వామి”గానే కొనసాగుతామని తెలిపారు.

ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలకు ముప్పు పొంచి ఉండడం ఇది మొదటిసారి కాదు. కానీ ప్రతిసారీ మేము రెండు దేశాల జాతీయ ప్రయోజనాల ఆధారంగా కొత్త సహకార మార్గాలను కనుగొన్నాం. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది అని రష్యా మంత్రి బబుష్కిన్ అన్నారు. భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని, ఇది వార్షికంగా సుమారు 10% వృద్ధితో సాధ్యమవుతుందని తెలిపారు.

Also Read:TTD:అందుబాటులోకి స్వామి పుష్కరిణి

2024-25లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో $68.7 బిలియన్ చేరింది. అయితే, ఇందులో భారత్ ఎగుమతులు కేవలం $4.88 బిలియన్ మాత్రమే. ప్రస్తుత వాణిజ్య లోటు సుమారు $60 బిలియన్ ఉందని బబుష్కిన్ చెప్పారు.

- Advertisement -