Rajinikanth:వెనక్కి తగ్గేదిలేదు

63
- Advertisement -

ఏపీలో ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేతలు రజనీకాంత్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌కు ఫోన్ చేశారు చంద్రబాబు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దంటూ రజనీకాంత్‌కి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

వైసీపీ నేతల వ్యాఖ్యలకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఫోన్ లో తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా నావాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, నా అభిప్రాయం మారదని చంద్రబాబుకు స్పష్టం చేశారు. తన అభిమాన సంఘాలని సంయమనం పాటించమని విజ్ఞప్తి చేశానని రజనీ …చంద్రబాబుతో చెప్పారు.

Also Read:Uma Bharati:హ్యాపీ బర్త్ డే.. ఫైర్ బ్రాండ్

నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని చెబుతూనే.. చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసని … ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తి ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

Also Read:ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం..

- Advertisement -