కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ

12
- Advertisement -

విదేశీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు చంద్రబాబు.అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రాజకీయ పరిణామాలు, కూటమి వ్యవహారాలపై ప్రధానంగా చర్చలు సాగనున్నాయి.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ సీటు విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించనున్నారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 2న రానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను అమిత్ షాకు చంద్రబాబు వివరించనున్నారు.

ఉదయం 10:30 గంటలకు జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 11:15 గంటలకు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌తో, మధ్యాహ్నం 12:00 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు చంద్రబాబు.

Also Read:మహేశ్‌ బాబుకు షాకిచ్చిన ఈడీ..

- Advertisement -