మన రైతుబంధు పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారుః కేటీఆర్

254
KTR wanaparthy
- Advertisement -

ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రైతు బంధు పథకాన్ని కాపి కొట్టారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లో గులాబీ జెండా ఎగురడం ఖాయం అన్నారు కేటీఆర్. రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మూడు జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇవాళ కేసీఆర్‌ ఆలోచనలే.. దేశానికి ఆచరణగా మారాయి.

కేసీఆర్‌ స్వయంగా రైతు అయినందువల్లే రైతు సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. మన రైతు బంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా కాపీ కొట్టిందన్నారు. 43లక్షల మందికి ఆసరా ఫించన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వచ్చే నెలనుంచి ఆసరా పెంచన్లు 2016 రూపాయలు ఇస్తామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ఆసుపత్రులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దామని తెలిపారు.

పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్షాల కండ్లు ఎర్రబడుతున్నాయి. మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇస్తుంటే కాంగ్రెస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు. ఐదేళ్ల క్రితం భారీ మెజార్టీతో మోదీని గెలిపిస్తే ఆయన ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. పోలవరానికి జాతీయహోదా ఇచ్చిన కేంద్రం కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అటు బీజీపీకి ఇటు కాంగ్రెస్ కు సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు 16 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీ లో చక్రం తిప్పవచ్చని తెలిపారు.

- Advertisement -