కేసీఆర్…సీఎం కావడం ప్రజల అదృష్టం: ధర్మారెడ్డి

1130
challa dharmareddy
- Advertisement -

తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. చాణక్య ఫౌండేషన్‌ ప్రకటించిన ఉత్తమ ఎమ్మెల్యే అవార్డును ఢిల్లీలో పద్మ విభూషన్ మురళీ మనోహర్ జోషి చేతుల మీదుగా అందుకున్నారు.

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఉత్తమ ఎమ్మెల్యేగా గుర్తింపు రావడానికి దోహదపడిందన్నారు.

సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అందుకే జాతీయ ఉత్తమ ఎమ్మెల్యే అవార్డుకు ఎంపికయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, చాణక్య ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -