ఈటల ప్రజలకు సమాధానం చెప్పాలి: చల్లా

149
challa
- Advertisement -

ఈటల బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పల్లా.. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరార‌ని విమ‌ర్శించారు.

రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్ప‌టికీ మొండి వైఖరి ప్రదర్శిస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్యక్తంచేశారు.ఈ సంద‌ర్భంగా ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మోకిడే బాబురావు, జములాపురం లింగారావు, సిద్ధే గోపాల్ రావులు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు.

రైతుబంధును వ్య‌తిరేకిస్తున్నాని చెప్పిన ఈట‌ల‌.. ఆ ప‌థ‌కం కింద‌ ఇప్ప‌టివ‌ర‌కు రూ.26 లక్షలు ఎందుకు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. కేంద్రంలో పరిపాలనా లోపం వల్లే గ్యాస్, చమురు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయ‌న్నారు.

- Advertisement -