- Advertisement -
లవ్‌స్టోరీ, బంగార్రాజు వంటి హిట్ సినిమాలతో జోష్ మీదున్నారు నాగచైతన్య. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ , దూత అనే థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. వీటితో పాటు నందిని రెడ్డి, పరశురామ్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు.
ఇక చైతూ నటించిన థాంక్యూ విడుదలకు సిద్ధంగా ఉంది. జూలై 7న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాలో చైతూ .. హీరో మహేశ్ బాబుకు వీరాభిమాని. అలాగే అతడో క్రికెటర్ కూడా. దీనికోసం ప్రత్యేకంగా ఒక్కడు, పోకిరి కటౌట్లు వేసి షూటింగ్ జరిపారు.
చైతూ సరసన అవికా గోర్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు.
- Advertisement -