చైతుకి ప్రేమతో సామ్

460
Chai and Sam Special Valentine Kiss
- Advertisement -

టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య – సమంత ప్రేమికుల రోజు హైలెట్‌గా నిలిచారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్న ఈ జంట.. త్వరలో ఒకటి కాబోతోన్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా  సమంత.. చైతూని ప్రేమతో ముద్దుపెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  సమంత తన నుదుటిపై ముద్దు పెడుతుంటే.. చైతూ ముఖంలో నవ్వులు పూచాయి.

ఈ రోజులో ఏముంది.. అన్ని రోజుల కంటే, ప్రతిరోజు కంటే అని సమంత పోస్ట్‌ చేస్తూ లవ్‌ఆఫ్‌మైలైఫ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన అభిమానులు తమ కామెంట్లతో అభిమాన జంటకు దీవెనలు అందిస్తున్నారు. చక్కటి జంట, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటూ  కామెంట్స్‌  పోస్ట్ చేస్తున్నారు.

ఏ మాయ చేసావె చిత్రంతో మంచి స్నేహితులుగా మారిన వీరిద్దరు తర్వాత ఒకర్నొకరు ఇష్టపడ్డారు. త్వరలో అంగరంగవైభవంగా వీరిద్దరి వివాహం జరగనుంది. ఇక ప్రేమ గురించి చై-సామ్ కూడా అంతే అందంగా నిర్వచనం ఇచ్చారు. ప్రేమంటే ఆనందంగా ఉండడమే. అంతకు మించి నిర్వచనం నాకు తెలీదు. స్కూల్లో, కాలేజీలో కొన్ని ప్రేమకథలు నడిచాయి. కానీ… అవన్నీ కేవలం ఆకర్షణలు మాత్రమేనని చై అంటుండగా  నా సినీ ప్రయాణంలోని ప్రతీ మలుపులోనూ చై ఉన్నాడు. స్నేహంతోనే మా ప్రేమ మొదలైంది. అయితే ఓ నిర్ణయం తీసుకోవడానికిఇంత సమయం పట్టింది. నా దృష్టిలో ప్రేమంటేనే చై. ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రేమ జంట మాదేనని సంబురపడిపోతుంది సామ్.

Chai and Sam Special Valentine Kiss

- Advertisement -