శ్రీ విష్ణు … ‘మెంటల్ మదిలో’

203
Its Mental Madhilo
- Advertisement -

పెళ్లి చూపులు చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్న రాజ్ కందుకూరి ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న మరో చిత్రం మెంటల్ మదిలో. ఈ మధ్యే విడుదలై సంచలనం క్రియేట్ చేసిన మల్టీ స్టారర్ అప్పట్లో ఒకడుండేవాడు. ఈ చిత్రంలో నారా రోహిత్ తో పాటు శ్రీ విష్ణు కీలక పాత్ర పోషించాడు. ఇందులో విష్ణు నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ప్రేమ ఇష్క్ కాదల్, నల దమయంతి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్యయమ్మురా వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందతున్న ఈ చిత్రానికి మెంటల్ మదిలో అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక క్యాప్షన్ గా మనవి ఆలకించరాదే అని పెట్టారు. చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నివేథ పెతురాజ్ ఈ సినిమాతో డెబ్యూ ఇస్తున్నది.

పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి ధర్మపథ క్రియేషన్స్ పై బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ 24 రోజులు పూర్తి చేసుకుందని, ఈ వారంలో రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని, వాలంటైన్స్ డే సందర్భంగా మెంటల్ మదిలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ అందరిని ఆకట్టుకుందని తెలిపారు.

- Advertisement -