కోవిడ్ టీకా పంపిణీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

141
Covid_vaccination
- Advertisement -

దేశంలో కరోనా నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతుంది. కరోనా నిర్మూలన వ్యాక్సిన్‌తో సాధ్యమని కేంద్రం వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్ఠి పెట్టింది. ఈ నేపథ్యంలో జాతీయ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. జూన్‌ 21లోపు రెండు వారాల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. జనాభా, కరోనా కేసులను బట్టి రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్టు వెల్లడించింది. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ కేటాయింపుల్లో కోత విధిస్తామని కేంద్రం పేర్కొంది. తయారీదారుల నుంచి 75శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం సేకరించనున్నది.

జాతీయ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం ఉచిత టీకా సరఫరా చేయనుంది. ప్రభుత్వ కేంద్రాల ద్వారా ఉచితంగా టీకాలు అందజేయాలని కేంద్రం వెల్లడించింది. 18 ఏళ్ళు పై బడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాళ వద్దా అనేది రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు.కేంద్రం తెలిపింది. వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు టీకాలు కేటాయింపు జరగనుంది. వ్యాక్సిన్ వేస్టేజ్ ప్రభావం కేటాయింపులపై ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం వ్యాక్సిన్ల సరఫరాపై ఆయా రాష్ట్రాలకు ముందే సమాచారం అందించనున్నది.

అన్ని ఆస్పత్రులకు సమానంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కావాల్సిన డోసుల వివరాలను రాష్ట్రాలే ఇవ్వాలని తెలిపింది. పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవడం కోసం ఈ-వోచర్లు ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది. ఇక కోవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు..

– జిల్లా, టీకా కేంద్రాల స్థాయిలో వ్యాక్సిన్ లభ్యత సమాచారం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలి.
– టీకా తయారీదారులు నెలవారీ ఉత్పత్తిలో 25% ప్రైవేటు ఆస్పత్రిలకు ఇవ్వొచ్చు.
– ప్రైవేటు ఆస్పత్రుల సర్వీస్ ఛార్జ్ రూ.150 మించకూడదు.
– రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై నిఘా ఉంచాలి.
– పౌరులందరూ వారి ఆదాయ స్థితితో సంబంధం లేకుండా ఉచిత టీకాలకు అర్హులు.
– కో-విన్ ప్లాట్‌ఫాం ప్రతి పౌరుడికి టీకాల బుకింగ్ ను సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రీ-బుకింగ్ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.
– అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాలు ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాయి.

- Advertisement -