“సాహో” షూటింగ్ లో కేంద్రమంత్రి

381
central minister Nitin Gadkari visited the shooting location of Sahoo
- Advertisement -

యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో ఈమూవీ తెరకెక్కనుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించగా..సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. ఈసందర్భంగా సాహో షూటింగ్ జరుగుతున్న ప్లేస్ వెళ్లారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి. అక్కడ తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈఫోటోలలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరి, ప్రభాస్, శ్రద్దా కపూర్, దర్శకుడు సుజీత్ లు ఉన్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.

సాహో సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు ఈసినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. యూవీ క్రియేషన్స్ సంస్ధ వారు నిర్మిస్తున్న ఈచిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు త్రయం శంకర్ -ఇషాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -