భారత మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ దేశ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. దేశం ఆర్థికంగా గడ్డు కాలంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి గా ఎంతో చేశారని అన్నారు. మన్మోహన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన ఆర్థిక సంస్కరణలను గురించి ఉద్దేశిస్తూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నితిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
భారత్‌లో పేద వర్గాలకు లబ్ది చేకూర్చే ఉదారవాద ఆర్థిక విధానాల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన్న ఈ వ్యాఖ్యలు చేశారు. 1991లో ఆర్ధిక మంత్రి హోదాలో మన్మోహన్ చేపట్టిన సంస్కరణలు కొత్త మార్గాన్ని చూపెట్టాయని గడ్కరీ కొనియాడారు. ఆ సమయంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నానని సంస్కరణల వల్లే రోడ్లు వేశామని అన్నారు. అందుకోసం భారీ మొత్తంలో పెద్ద ఎత్తున్న నిధులు సమీకరించామని అన్నారు. ప్రస్తుతం రైతులు పేదల కోసం మరిన్ని ఉదారవాద సంస్కరణల్నీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు.
రోడ్లు రహదారుల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ సామాన్య ప్రజల నుంచి కూడా నిధుల సమీకరిస్తోందని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం కేంద్రరోడ్డు రహదారుల శాఖ కొత్తగా26ఎక్స్‌ప్రెస్‌లనునిర్మిస్తోందని నిధులకు ఎలాంటి కొరత లేదని అన్నారు. రోజుకు 60కిమీ రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐకి ఏటా రూ.40వేల కోట్ల టోల్ రెవెన్యూ వస్తోందని అది 2024ఆఖరి వరకురూ.1.40లక్షల కోట్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..