యూ నో చెర్రీ వెరీ బీజీ

134
- Advertisement -

ఆర్ఆర్‌ఆర్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకు రాబోతున్నాడని టాలీవుడ్‌ టాక్. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చేసే సినిమాలు విషయంలో చెర్రీ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లుతున్నాడు. ఇటీవలే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమా చేసేందుకు చెర్రీ చర్చలు జరుపుతున్నట్టు వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది.

స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్యాప్ర్‌లో రెడీ చేసిన కథని బుచ్చిబాబు వినపించగా…స్టోరీ నచ్చినప్పటికీ చరణ్‌ ఇంకా ఓకే చెప్పలేదని టాక్‌. ప్రస్తుతం చెర్రీ తమిళ శంకర్‌ సుకుమార్ లతో సినిమాలు సెట్స్ పైకి వెళ్లాయి.

తాజాగా బింబిసారతో మంచి హిట్‌ కొట్టిన వశిష్ట…చెర్రీతో కలిసి మరో సినిమాను తెరపైకి తెవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యువ దర్శకుడితోనూ చరణ్ కథ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాని బిగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వశిష్ట మొదటి చిత్రం కంటే ఈ మూవీ ఇంకా గ్రాండ్‌గా ఉంటుందని అంటున్నారు. ఇదే నిజమైతే.. రెండో సినిమాతోనే ఈ యువ దర్శకుడు పాన్ ఇండియా స్థాయి అవకాశం కొట్టేసినట్లేనని అందరూ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

BB6..ఫైమాని ఉతికిఆరేసిన ఇనయ!

సల్మాన్‌తో తెలుగు బాక్సర్‌ స్టెప్పులు

మాస్‌కా బాప్‌..రామ్‌తో బోయపాటి!

- Advertisement -