లోక్‌సభలో కాంగ్రేస్ ఎంపీ దీపక్ బైజ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జిత్రేంద్ర సింగ్ విస్తూపోయే నిజాన్ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిలో వీటిలో గ్రూప్ ఏ పోస్టులు 23,584, గ్రూప్ బీ పోస్టులు 1,18,807, గ్రూప్ సీ పోస్టులు 8,36,936. ఈ యేడాది ఆగస్ట్ నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 979327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
రైల్వే మంత్రిత్వ శాఖలో 2,93,943 ఖాళీలు, రక్షణ (సివిల్) శాఖలో 2,64,704 ఖాళీలు, హోం వ్యవహారాల శాఖలో 1,43,536 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. రైల్వేలో మొత్తం 15,14,007 పోస్టులు ఉండగా, 2,93,943 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం రైల్వేలో 12,20,064 మంది ఉద్యోగులున్నారు. అదేవిధంగా డిఫెన్స్ (సివిల్)లో 6,46,042 పోస్టులు మంజూరుకాగా 2,64,707 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హోం వ్యవహారాల శాఖలో మంజూరైన 10,85,728 పోస్టుల్లో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని లోక్‌సభకు తెలిపారు.
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో 446 పోస్టులు మంజూరుకాగా 129 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అలాగే రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో మంజూరైన 380 పోస్టులకు 91 ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పీఎస్‌యూలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల్లోను బ్యాంకులు మరియు ఇతర సంస్థల ద్వారా 1.47 లక్షల కొత్త నియామకాలు జరిగాయని మంత్రి లోక్‌సభలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి…