చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం

6
- Advertisement -

దేశీయంగా చక్కెర లభ్యతను పెంచడం మరియు ధరలను అదుపులో ఉంచడం కోసం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా (Middle East) సంక్షోభం కారణంగా ఏర్పడుతున్న ద్రవ్యోల్బణ ముప్పును దృష్టిలో ఉంచుకుని, సెప్టెంబర్ 30, 2026 వరకు చక్కెర ఎగుమతులపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

ముడి చక్కెర (Raw Sugar), తెల్ల చక్కెర (White Sugar) మరియు రిఫైన్డ్ చక్కెర ఎగుమతులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల సరఫరా దెబ్బతినడం, ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడం వల్ల దేశీయంగా చక్కెర కొరత ఏర్పడకుండా చూడాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మినహాయింపులు: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యూరోపియన్ యూనియన్ మరియు అమెరికాకు కోటా ప్రాతిపదికన జరిగే ఎగుమతులకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే మే 13 లోపు లోడింగ్ పూర్తయిన షిప్‌మెంట్లకు అనుమతి ఉంటుంది.

ALso Read:కొబ్బరి సాగులో గుజరాత్ టాప్!

రాబోయే వర్షాకాలంపై నెలకొన్న అనిశ్చితి, ఎల్ నినో ప్రభావం వల్ల చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఎరువుల సరఫరాకు ఆటంకం ఏర్పడితే, వచ్చే సీజన్లలో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

- Advertisement -