కొబ్బరి సాగులో గుజరాత్ టాప్!

2
- Advertisement -

కొబ్బరిసాగులో గణనీయమైన ప్రగతి సాధించింది గుజరాత్. కొబ్బరి సాగుకు అనుకూలమైన వాతావరణం మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో బొండాల ఉత్పత్తి భారీగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం, ఉత్పత్తిలో 20 శాతం వృద్ధి నమోదైంది.

గుజరాత్ రాష్ట్ర బొండాల వార్షిక ఉత్పత్తి విలువ ఇప్పుడు రూ. 26 కోట్లకు చేరుకుంది. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగానికి పెద్ద ఊరటనిస్తోంది. తీర ప్రాంత జిల్లాల్లో రైతులు సంప్రదాయ పంటల కంటే కొబ్బరి సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల దిగుబడి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

మార్కెట్‌లో బొండాలకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన అవగాహనే. ప్యాక్ చేసిన పానీయాల కంటే ప్రకృతి సిద్ధమైన కొబ్బరి నీళ్లకే ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెరిగిన ఉత్పత్తి వల్ల స్థానిక రైతులకు మంచి ఆదాయం లభిస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి.

Also Read:TTD:శ్రీవారి టికెట్లలో అవకతవకలు

గుజరాత్ ప్రభుత్వం కొబ్బరి రైతుల కోసం మరిన్ని రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో రానున్న రోజుల్లో ఈ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -