- Advertisement -
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తుది దశ పర్యావరణ అనుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నలిచ్చింది. ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోన్న ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం పనులు.. తుది దశ పర్యావరణ అనుమతులు రావడంతో ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కానున్నాయి.
ఇంతకు ముందే అటవీ, భూగర్భ జలశాఖ, కన్‌స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందిన విషయం విదితమే. తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి.
- Advertisement -