ఓటర్‌ కార్డుకు వయసులో మర్పులు : కేంద్ర ఎన్నికల సంఘం

61
voter
- Advertisement -

భారత రాజ్యంగం ప్రసాదించిన వాటిలో 21 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు వేసే హక్కు కలదు. కాలంతో పాటుగా భారత పౌరుల వయసును కూడా తగ్గించుకుంటూ వచ్చింది. తాజాగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 17 ఏళ్ల వయసు పై బడిన పౌరులు ఓటరు కార్డు కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారికే ఓటరు జాబితాలో నమోదుకు అర్హులు కాగా …. తాజాగా 17 ఏళ్ల వారందరికీ అవకాశం లభించినట్లయ్యింది. ఓటరు నమోదుకు అవసరమైన సాంకేతికతను అందుబాటులో ఉంచాలని రాష్ట్రాల సీఈఓలకు సూచించారు. మరోవైపు ఆధార్‌ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను ఆగస్టు 1 నుంచి ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ …. ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని, స్వచ్ఛందం మాత్రమేనని స్పష్టం చేసింది.

- Advertisement -