బుస్టర్‌ డోసుగా కార్బెవ్యాక్స్‌ ….

132
booster
- Advertisement -

తొలి రెండు టీకా డోసులుగా కొవాగ్జిన్‌ లేదా కొవిషిల్డ్‌ తీసుకున్న 18 ఏళ్లు పై బడిన వారికి ముందు జాగ్రత్త డోసుగా బయోలాజికల్‌-ఈకి చెందిన కార్బెవ్యాక్స్‌ను వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు అధికారక వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఎన్‌టాగీ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఈ అనుమతులు ఇచ్చినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. తొలి రెండు డోసులు కొవాగ్జిన్‌ లేదా కొవిషిల్డ్‌ తీసుకున్న వయోజనులకు ఆరు నెలలు పూర్తయిన తర్వాత ప్రికాషన్‌ డోసు ఇచ్చేందుకు కార్బెవ్యాక్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కొవిన్‌ పోర్టల్‌లో ఇందుకు సంబంధించి మార్పులు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా కొవిడ్‌ 19కూ సంబంధించి తొలి రెండు డోసులుగా ఒక కంపెనీ టీకా ముందు జాగ్రత్త డోసుగా వేరే కంపెనీ టీకా వేయడం ఇదే తొలిసారి కాగా కార్బెవ్యాక్స్‌ టీకాను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ సంస్థ అభివృద్ధి చేసింది. ఆర్బీడీ ప్రొటీన్‌ ఆధారిత తొలి స్వదేశి కరోనా టీకా ఇదే కావడం విశేషం.

- Advertisement -