దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంటులను త్వరగా ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. చైనాలో ఉధృతమవుతున్న బీఎఫ్ 7 వేరియంట్ కట్టడికి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ ఎమర్జెన్సీ సమయంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మెడికల్ ఆక్సిజన్ స్టాక్లో పెట్టుకోవాలని రాష్ట్రాలను కోరింది. సమయానుకులంగా సన్నద్ధత మరియు ప్రతిస్పందనతో భవిష్యుత్తులో తలెత్తే కోవిడ్ 19ను ఎదురుకొవడానికి సిద్దంగా ఉండాలన్నారు.
పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మరియు ఇతర ఆక్సిజన్ సంబంధిత మౌలిక సదుపాయాలను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలపింది. ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు కోసం నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించింది.
ప్రస్తుతం దేశంలో కోవిడ్ తక్కువగా ఉన్న భవిష్యుత్తులో తలెత్తే సవాళ్లను ఎదరుర్కోవడానికి ఈ వైద్య మౌలిక సదుపాయాల నిర్వహణ చాల ముఖ్యమని తెలిపింది. అన్ని ఆరోగ్య సౌకర్యాలలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ లభ్యత మరియు వాటి రిఫిల్లింగ్ కోసం నిరంతరమైన చైన్ సిస్టమ్ ఉండేలా చూడాలని సూచించారు. వెంటిలేటర్లు బైఏపీపీ మరియు ఎస్పీవో2 సిస్టమ్‌ల ఫంక్షనల్ లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్‌ల లభ్యతతో పాటు వాటి వినియోగ వస్తువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఆక్సిజన్ సంబంధిత సమస్యలను మరియు సవాళ్లను వాటి సత్వర పరిష్కారాలను కోసం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటి కోసం ప్రత్యేక గదులను పునరుద్ధరించాలని సూచించింది. కోవిడ్ ఎమర్జెన్సీ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నది. కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ ఇవాళ అన్ని రాష్ట్రాలకు లేఖను కూడా రాశారు.
ఇవి కూడా చదవండి…
బూస్టర్ డోసులను పంపించండి:హరీశ్
ఉచిత రేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం
పండుగల వేళ కోవిడ్ నియమావళి…