కేథరిన్‌కు చుక్కలు చూపించిన..అలీ!

272
Catherine Tresa at Ali tho saradaga
- Advertisement -

‘ఇద్దరమ్మాయిలతో’ .. ‘సరైనోడు’.. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కేథరిన్. సరైనోడులో ఎమ్మెల్యేగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం  తెలుగుతో పాటు తమిళ,మలయాళ ,కన్నడ సినిమాల్లోనూ వరుసగా సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా  అలీతో సరదాగా  కార్యక్రమంలో పాల్గొన్న కేథరిన్ కు కొంటె ప్రశ్నలతో అయోమయంలో పడేశాడు.

ఇప్పుడు ఇండస్ట్రీలో వున్న టాప్ హీరోల్లో ఒక మల్టీ స్టారర్ మూవీ చేయాల్సి వస్తే, ఎవరికి అక్కగా .. ఎవరికి వదినగా .. ఎవరికి లవర్ గా చేస్తారు? అని అలీ అడగగా దీంతో ఆమె ఆలోచనలో పడిపోయింది. ప్రభాస్ కి అక్కగా చేయాలంటే చేస్తారా? అంటే, నో అంటూ ఆమె సిగ్గుపడిపోయింది.

కేథరిన్ కి, ‘కాబోయే భర్త ఎలా ఉండాలి? అని అంటూ అలీ  ‘ప్రభాస్ మాదిరిగా హైట్ ఉండాలా? మహేశ్ బాబులా తెల్లగా ఉండాలా? పవన్ కల్యాణ్ లా డైలాగ్స్ చెప్పాలా? అంటూ అలీ అడిగాడు. అందుకామె స్పందిస్తూ .. “ఈ విషయంలో నా దగ్గర పెద్ద లిస్టే వుంది. లుక్స్ పరంగా చూసుకుంటే అబ్బాయి మంచి షూ వేయాలి. డీసెంట్ డ్రెస్ సెన్స్ వున్నవాడై ఉండాలి. కరెక్ట్ హైట్ తో .. ఫిట్ గా ఉండాలి. మంచి హెయిర్ స్టైల్ ఉండాలి. ఆకర్షణీయమైన కళ్లు .. కొంచెం షార్ప్ గా వుండే ముక్కు ఉండాలి. గుడ్ సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి’ అని చెప్పుకొచ్చింది.

అల్లు అర్జున్‌తో మూడు సినిమాలు చేయడంపై స్పందించిన కేథరిన్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో ఆ పాత్ర కోసం నేను ఫిట్ అనుకుని పూరీగారు తీసుకున్నారు. ‘రుద్రమదేవి’ సినిమాలో నేను చేసింది గెస్ట్ రోల్. ఆ ప్రాజెక్టు చివరిలో అల్లు అర్జున్ వచ్చాడు. ‘సరైనోడు’ సినిమాకి నన్ను తీసుకోవడమనేది బోయపాటిగారి నిర్ణయం. ఆ రోల్ కోసం నేను కరెక్ట్ ఛాయిస్ అని ఆయన అనుకోవడం వలన తీసుకున్నారు. ఆ సినిమాలోని పాత్ర నాకు ఎంతో సంతోషాన్ని .. సంతృప్తిని ఇచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది.

తన కళ్లు చాలా బాగుంటాయని నాతో పనిచేసిన వాళ్లందరూ ఇదే మాట చెప్పారని తెలిపింది.

- Advertisement -