వైఎస్ఆర్‌గా మమ్ముట్టి..

246
Mammootty in YSR's biopic?
- Advertisement -

ప్రస్తుతం సినీ ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్ ల హ‌వా న‌డుస్తోంది. ఇప్పటివరకు  ధోని,సచిన్,యువరాజ్ బయోపిక్‌లు తెరమీదకు రాగా తెలుగులో మ‌హాన‌టి సావిత్రి, సైరా న‌ర‌సింహారెడ్డి, స్వర్గియ ఎన్టీ రామారావు జీవిత చ‌రిత్ర‌లు తెర‌కెక్కుతున్నాయి. ఈ  జాబితాలో మరో సినిమా చేరిపోయింది.

ఏపీ మాజీ సీఎం స్వర్గియ‌ వైఎస్ఆర్ జీవితం ఆధారంగా సినిమాను నిర్మించేందుకు క‌స‌ర‌త్తు జరుగుతోంది.  ఆనందో బ్రహ్మ‌తో హిట్ కొట్టిన  డైర‌క్ట‌ర్ మహి వి.రాఘవ్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు.  ఇందులో రాజశేఖర్‌ పాత్రలో మలయాళ సూప‌ర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే డైర‌క్టర్ సినిమా సంబంధి వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ తో సంప్ర‌దింపులు జ‌రిపారని…వైఎస్సార్ బ‌యోపిక్ కు  జ‌గ‌న్ అంగీక‌రించ‌న‌ట్లు టాక్. అన్నీ కుదిరితే  ఈ సినిమా త్వ‌ర‌లో సెట్ పైకి వెళ్ల‌నుంది.

గ‌తంలో వైఎస్ ఆర్ జీవితాన్ని సినిమాగా తెర‌కెక్కించాల‌ని డైర‌క్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ప్లాన్ చేశాడు. అయితే అది ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు అదే వైఎస్ ఆర్ జీవితాధారంగా ఓ బయోపిక్‌ రాబోతోంది.

- Advertisement -