73 ఏళ్ల భారతం.. శవానికి సైతం అంటరానితనం

571
fallen-from-bridge1
- Advertisement -

బతికున్నప్పుడే కాదు, చనిపోయి శవంగా మారాక కూడా దళితులను ‘అంటరానితనం’ ఎలా వెంటాడుతుందో తెలిపే హృదయవిదారక సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. శవాన్ని తమ పొలాల మీదుగా తీసుకెళ్లడానికి అగ్రవర్ణాల వారు అంగీకరించకపోవడంతో బ్రిడ్జి మీద నుంచి తాళ్ల సాయంతో శవాన్ని కిందికి దించి అంత్యక్రియలు నిర్వహించారు.

వివరాల్లోకి వెళ్తె… వెల్లూరు జిల్లాలోని నారాయణపురం గ్రామంలోని దళితవాడకు చెందిన ఎన్‌.కుప్పమ్‌ (46) శనివారం చనిపోయాడు. బంధుమిత్రులు మృతదేహాన్ని పొలాల గుండా శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా అగ్రవర్ణాలకు చెందిన వారు అడ్డుకున్నారు. తమ పొలం నుంచి శవాన్ని తీసుకెళ్లకూడని తేల్చిచెప్పారు. అ

అప్పటికే తీవ్ర విషాదంలో ఉన్న బాధితులు చేసేదేమీ లేక సమీపంలోని వంతెనకి మృతదేహాన్ని తీసుకెళ్లారు. 20 అడుగుల ఎత్తు నుంచి వంతెన కిందకు తాళ్లతో దింపి తర్వాత శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -