ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియానే. ఇక ఆర్ధిక సంస్కరణలు జరిగి మూడు దశాబ్దాలు పూర్తి కాగా ఒకప్పటి భారతదేశానికి ప్రస్తుత ఇండియాకు చాలా తేడా జరిగింది. ఆర్థిక సంస్కరణల కారణంగా దేశంలో వివిధా రంగాల్లో ఘణనీయమైన ప్రగతి సాధించాం. ఒకప్పుడు ఒకే టీవీ ఛానల్, ఒకే రేడియో, ఒకే విమానయాన సంస్థ, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు, టెలిఫోన్ బూత్‌ల ముందు కస్టమర్ల పడిగాపులు…ఇదీ దృశ్యం. కానీ, ఇప్పుడు ఎన్నెన్నో విప్లవాత్మక మార్పులు.
1950-51లో దేశంలో మొత్తం 430 వాణిజ్య బ్యాంకులు ఉండేవి. 1969లో 14 వాణిజ్య బ్యాంకులను, 1980లో 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అయితే రిజర్వుబ్యాంకు అనుసరించిన బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది.
బ్యాంకింగ్ రంగంలో ప్రధానమైంది ఆర్బీఐ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలోని ఆర్ధిక నియంత్రణ,డబ్బుకు సంబంధించిన ప్రతి దానిని నియంత్రిస్తుంది. దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, RRB లు, సహకార బ్యాంకులు మరియు అన్ని రకాల నాన్- బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలను ఆర్బీఐ క్రమబద్దీకరిస్తుంది. ఇది ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది. ద్రవ్య విధానం సహాయంతో దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది.
Also Read:‘భోళా శంకర్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఆర్థిక పరమైన అంశాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ప్రపంచంలో టాప్ 4 ఆర్థిక శక్తిగా ఇండియా నిలిచింది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా గడిచిన కాలంలో బ్యాంకింగ్ సెక్టార్‌లో సాంకేతిక అభివృద్ధి ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా డిజిటల్ పేమెంట్స్ మన దేశంలో జరుగుతున్నాయి. ఇక బ్యాంకుల విలీనంతో మరో ముందడుగు పడింది. ఒకప్పుడు బ్యాంకు అకౌంట్ తెరవాలంటే ఎన్నో కండీషన్స్..కానీ ఇప్పుడు బ్యాంకు అకౌంట్ కావాలంటే చాలా తేలిక.
ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేసిన ప్రైవేట్ బ్యాంకుల్లో .. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. 1980 తర్వాత ఆంధ్రాబ్యాంకు తోపాటు మరో 13 బ్యాంకులను కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది.
సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువైనా బడా బాబులకు మాత్రం బ్యాంకింగ్ రంగం కల్పతరువుగా మారింది. ప్రధాని మోడీ అధికారంలోకొచ్చిన ఈ తొమ్మిదేళ్లలో 12 లక్షల, 50 వేల, 553 కోట్ల రూపాయల నష్టాన్ని బ్యాంకులు చవిచూచాయి. భారత దేశ చరిత్రలో బ్యాంకులను ఎవరూ, ఎప్పుడూ ఇలా దెబ్బ తీయలేదు. ఎలాంటి కుంభకోణం లేకుండా, పరిణామాలు జరగకుండా, ప్రజల్లో చర్చ జరగకుండా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఇలా బ్యాంకులను తుడిచివేయలేదు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అనే తేడా లేదు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును ఉద్దేశపూర్వకంగా రుణాలుగా తీసుకుని, ఎగవేసి, ఆస్తులు లాక్కునే వారికి, రాజకీయ ఆశీస్సులున్న వారికి కట్టబెడుతున్నారు. ఇదే బ్యాంకులు దివాళా తీయడానికి కారణమయ్యాయి.
Also Read:twitter review:భోళా శంకర్..బోర్ కొట్టిస్తుందా?