వావ్.. ఏడు గెటప్స్‌ లో చరణ్!

30
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమాకు అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ IAS అధికారి పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తన సినిమాల్లో హీరోలను కథానుగుణంగా విభిన్న గెటప్స్‌లో చూపించడం దర్శకుడు శంకర్‌ ఆనవాయితీగా వస్తోంది. ఇదే సూత్రాన్ని ఈ చిత్రంలో కూడా శంకర్ ఫాలో అయ్యారు. ఇందులో భాగంగా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఏకంగా ఏడు విభిన్నమైన గెటప్స్‌ లో కనిపిస్తారని చెబుతున్నారు. మరి రామ్ చరణ్ గెటప్స్ ను దర్శకుడు శంకర్ ఎలా డిజైన్ చేశారో చూడాలి.

ఎంతైనా ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత‌.. చరణ్ చేస్తున్న తొలి పాన్ ఇండియ‌న్ సినిమా ఇదే. అందుకే ఈ సినిమా పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే.. ఈ సినిమా విషయంలో శంకర్ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. దీనికితోడు, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారని టాక్. చరణ్ కి మెంటర్ గా అక్షయ్ కుమార్ గేమ్ చేంజర్ లో ఎంట్రీ ఇస్తాడట.

Also Read:‘భోళా శంకర్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

మరి, అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తే.. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫుటేజ్ ఈమ‌ధ్య బ‌య‌ట‌కు లీక్ అయ్యింది. అందులో చరణ్ గెట‌ప్‌, స్టైల్‌.. ఫ్యాన్స్‌కి తెగ న‌చ్చేశాయి. వింటేజ్ రామ్ చరణ్ ను చూస్తున్న‌ట్టుంద‌ని మెగా ఫ్యాన్స్ హ్యాపీ ఫీల‌వుతున్నారు. కాబట్టి.. చరణ్ గెటప్ ల పై ఏ వార్త వచ్చినా మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా వచ్చిన ఈ ఏడు గెటప్ ల న్యూస్ ను కూడా తెగ వైరల్ చేస్తున్నారు. అన్నట్టు భోళా శంకర్ నేడు రిలీజ్ అయ్యింది. గేమ్ ఛేంజర్‌ టీమ్ కూడా ఈ రోజు నైట్ సినిమాకి వెళ్తుందట.

Also Read:నగదు రహిత భారతదేశం…

- Advertisement -