దగ్గుబాటి సమర్పణలో ‘నేను కిడ్నాప్ అయ్యాను’..

302
Cartoonist Mallik in a Special Role in ''Nenu Kidnap Ayyanu''
- Advertisement -

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, ‘కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో’ దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. నిర్మాత మాధవి అద్దంకి మాట్లాడుతూ.. షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని ప్రస్తుతం సెన్సార్ వర్క్స్ చేస్తున్నాము. డైరెక్టర్ శ్రీకర్ బాబు చాల బాగా ఈ సినిమా తీశారు. మా చిత్రం ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది” అన్నారు.

Cartoonist Mallik in a Special Role in ''Nenu Kidnap Ayyanu''

దర్శకుడు శ్రీకర్ బాబు మాట్లాడుతూ.. మా చిత్రంలో ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ ప్రముఖ పాత్రలో నటించారు. ఆయనకిది మొదటి చిత్రం. ఇంతకు ముందు ఆయనకు చాలా అవకాశాలు వచ్చినా ఆయన చేయలేదు. అలాంటిది మా సినిమాలో యాక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా వుంది. ఆయన అన్ని సన్నివేశాలు సింగల్ టేక్ లో చేసేసారు. ఆయన కాంబినేషన్‌లో యాక్ట్ చేసిన పోసాని, మిగతా ఆర్టిస్ట్ లు ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయారు.. అందరు ఆయన్ని అభినందించారు. మేమందరం ఆయన సీన్స్ రష్ చూసి ఎంతో ఆనందించాము. చిత్రానికి పని చేసిన యూనిట్ సభ్యులందరు చాల బాగా సపోర్ట్ చేశారు.

Cartoonist Mallik in a Special Role in ''Nenu Kidnap Ayyanu''

రఘు బాబు, కృష్ణ భగవాన్, పోసాని , తాగుబోతు రమేష్ చాలా బాగా సహకరించారు. మా చిత్ర నిర్మాత మాధవి అద్దంకి మాకు చాలా సపోర్ట్ చేశారు. మా వెన్నంటి ఉండి మాకు షూటింగ్ కి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశారు. మా చిత్రం రషెస్ ప్రముఖ దర్శకులు మమ్మల్ని మెచ్చుకోవడం మాకు చాలా ఆనందంగా వుంది. అలాగే మా చిత్రాన్ని చూసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మా చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని జులై సెకండ్ లేదా థర్డ్ వీక్‌లో సినిమా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము” అన్నారు.

Cartoonist Mallik in a Special Role in ''Nenu Kidnap Ayyanu''

ఆర్టిస్ట్స్;పోసాని కృష్ణ మురళి,”కార్టూనిస్ట్” మల్లిక్,పృథ్వి,రఘు బాబు,కృష్ణ భగవాన్,తాగుబోతు రమేష్,మేల్కొటే సత్య,కోట శంకర రావు,సత్యానంద్,శ్రీకాంత్,ధీరేంద్ర,హర్ష కృష్ణ మూర్తి,విశాల్,సౌమిత్రి,మహిమ కొఠారి,అదితి సింగ్,తేజు రెడ్డి,బిందు బార్బీ,సప్నా ,టెక్నీషియన్స్;కథ – దర్శకత్వం : శ్రీకర్ బాబు,స్క్రీన్ ప్లే : దివాకర్ బాబు,డైలాగ్స్ : మల్లిక్,మ్యూజిక్ : శ్రీకాంత్,లిరిక్స్ : గంగోత్రి విశ్వనాధ్,ప్రొడ్యూసర్ : మాధవి అద్దంకి.

- Advertisement -