రేసర్ అశ్విన్ సజీవ దహనం..

212
Car Racer Ashwin Sundar, Wife Die As BMW Hits Tree
Car Racer Ashwin Sundar, Wife Die As BMW Hits Tree
- Advertisement -

భారతీయ ఎఫ్4 రేసర్ అశ్విన్ సుందర్ చెన్నై‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శనివారం తెల్లవారు జామున వారు తన భార్య నివేదితతో కలసి ఆయన ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురైంది. చెన్నై సమీపంలోని శాంతం హైరోడ్డులో రోడ్డు పక్కనున్న చెట్టును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారులో ఇరుక్కుపోయిన అశ్విన్, అతని భార్య ఈ ఘటనలో సజీవ దహనం అయ్యారు. కారు మంటల్లో చిక్కుకోవడం చూసిన స్థానికులు చెన్నై సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక దళంతో పాటు మైలాపూర్ నుంచి సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే అప్పటికే అరగంటకు పైగా వారు మంటల్లోనే చిక్కుకోవడంతో దారుణం జరిగిపోయింది. పోలీసులు కారు పగలగొట్టి మృతదేహాలను బయటికి తీశారు.

Car Racer Ashwin Sundar, Wife Die As BMW Hits Tree

అశ్విన్ మరణవార్తతో అందరూ షాక్ కు గురయ్యారు. అశ్విన్ సుందర్ 1985 జూలై 27 న చెన్నైలో జన్మించారు. 2003లో ఎంఆర్ఎఫ్ ఫార్ములా మోండియల్ నేషనల్ ఛాంపియన్ షిప్ ను తొలిసారి గెలుచుకున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎఫ్4 నేషనల్ ఛాంపియన్ గా అవతరించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సైతం అశ్విన్ ప్రతిభను కనబరిచారు. ఆయన భార్య నివేదిత ఓ ప్రయివేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు.

Master

- Advertisement -