వేర్వేరు ధరలకు వ్యాక్సిన్‌….కేంద్రంపై సుప్రీం ఫైర్

177
sc
- Advertisement -

కేంద్రానికి, రాష్ట్రాల‌కు వేర్వేరు ధ‌ర‌ల‌కు వ్యాక్సిన్లు ఇవ్వ‌డ‌మేంట‌ని కేంద్రాన్ని నిలదీసింది సుప్రీం కోర్టు. నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో దీనిపై కేంద్రానికే పూర్తి నియంత్ర‌ణ ఉండాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. కొవిడ్ సంక్షోభ నివార‌ణ‌లో భాగంగా ఆర్మీ వంటి కేంద్ర వ‌న‌రుల‌ను వినియోగించ‌డం, వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని అడిగింది.

గ‌త వారం దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ను సుమోటాగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. కొవిడ్‌పై జాతీయ ప్ర‌ణాళిక‌ను స‌మ‌ర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు కేంద్రం త‌మ ప్ర‌ణాళిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది. దానిని ప‌రిశీలించిన త‌ర్వాత శుక్ర‌వారం మ‌రోసారి దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

ఇలాంటి సంక్షోభం స‌మ‌యంలో కోర్టు ఓ మౌన ప్రేక్ష‌కుడిలా కూర్చోలేదు అని అత్యున్న‌త న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం తాము ప్ర‌య‌త్నిస్తామ‌ని సుప్రీం తెలిపింది.

- Advertisement -