స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నికలు రానున్నాయా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల బిఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఒక పార్టీ గుర్తు పై గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడంతో కడియం పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమౌతు వస్తున్నాయి. తన రాజకీయ లబ్ది కోసమే కడియం పార్టీ మారడని, ఆలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని.. ఈ రకమైన విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడియం పార్టీ పిరాయింపులకు పాల్పడినట్లు బిఆర్‌ఎస్ నేతలు మండి పడుతున్నారు. ఆయన పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కూడా. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరిని సస్పెండ్ చేస్తే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. .
ఇదే విషయాన్ని బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక జరగడం ఖాయమని, ఈ బైపోల్ కోసం పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని కేసిఆర్ సూచించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడూ వీడిన కడియం ను ఓడించడమే తమ లక్ష్యమని కేసిఆర్ చెప్పుకొచ్చారు. ఆ మద్య కేటిఆర్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. స్టేషన్ ఘనపూర్ లో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని కేటిఆర్ గతంలో వ్యాఖ్యానించారు. దీంతో బిఆర్‌ఎస్ అగ్రనేతలు ఉప ఎన్నికల గూర్చి నొక్కి చెబుతుండడంతో స్టేషన్ ఘనపూర్ లో బైపోల్ రావడం ఖాయం గా కనిపిస్తోంది.
ఇక వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణలో ఉప ఎన్నికల హడావిడి మొదలయ్యే అవకాశం ఉంది. అయితే కడియం శ్రీహరిపై బిఆర్‌ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ, స్పీకర్ కడియంపై అనర్హత వేటును ఆమోదించలేదు. అయితే పార్టీ పిరాయింపుల అంశంపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ గతంలోనే చెప్పుకొచ్చారు. దీంతో స్పీకర్ ఆమోదించకపోయిన కోర్టు ద్వారా కడియంపై అనర్హత వేటు తప్పదనేది కొందరి అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:టీ ‘టీడీపీ’ అయోమయం?