ఐపీఎల్ ఫీవర్ షురూ

260
buy tickets for IPL 10
- Advertisement -

హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి మొదలైంది. ఏప్రిల్ 5న ఉప్పల్‌ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ టికెట్లను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు సన్ రైజర్స్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రేక్షకులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మ్యాచ్‌లు జరిగే రోజుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

buy tickets for IPL 10

ఐపీఎల్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్‌తోపాటు ఎంపిక చేసిన కేంద్రాల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయ‌ని  పేర్కొంది. అలాగే ఆన్‌లైన్‌లోనూ టికెట్ల‌ను విక్ర‌యానికి ఉంచిన‌ట్టు తెలిపింది. వ‌చ్చే  నెల  5, 9, 17, 19, 30, మే 6, 8వ తేదీల్లో ఏడు మ్యాచ్‌లు ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి. ఆన్‌లైన్‌లో www.sunrisershyderabad.in వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసుకోవ‌చ్చు.

జింఖానా మైదానం, ఎల్బీ స్టేడియం, ఉప్పల్‌లోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో  శ‌నివారం ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు,  అత్తాపూర్‌, గచ్చిబౌలి, మలక్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, మదీనాగూడ, ఏఎస్‌ రావు నగర్‌, శివం రోడ్డులోని జస్ట్‌ బేక్‌ అవుట్‌లెట్లతో పాటు జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్‌లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించింది. ఇక కార్పొరేట్‌, బ‌ల్క్ బుకింగుల కోసం 8978781831 నంబ‌రులో  సంప్ర‌దించాల‌ని కోరింది.

buy tickets for IPL 10

హైదరాబాద్‌లో జరిగే ఏడు మ్యాచ్‌లకు కలిపి ఒకే ‘సీజన్‌ పాస్‌’ తీసుకోవాలనుకునే వారికి చార్జీలో 5 శాతం రాయితీ దక్కుతుంది. టీమ్‌ జెర్సీనీ ఉచితంగా అందజేస్తారు. ఏప్రిల్‌ 4లోగా సీజన్‌ పాస్‌ తీసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.  ఏప్రిల్ 4న జ‌రిగే ఆరంభ వేడుక‌లు, మే 21 జ‌రిగే ఫైన‌ల్ టికెట్ల విష‌యంలో మాత్రం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 47 రోజుల పాటు ఈ మెగా టోర్నీ జరగనుంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హోంగ్రౌండ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌

ఏప్రిల్‌ 5    రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు    రాత్రి గం. 8 నుంచి
ఏప్రిల్‌ 9    గుజరాత్‌ లయన్స్‌    సా. గం. 4 నుంచి
ఏప్రిల్‌ 17    కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌    రాత్రి గం. 8 నుంచి
ఏప్రిల్‌ 19     ఢిల్లీ డేర్‌డెవిల్స్‌    రాత్రి గం. 8 నుంచి
ఏప్రిల్‌ 30     కోల్‌కతా నైట్‌ రైడర్స్‌    రాత్రి గం. 8 నుంచి
మే 6     రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌    సా. గం. 4 నుంచి
మే 8    ముంబై ఇండియన్స్‌    రాత్రి గం. 8 నుంచి

- Advertisement -