‘పవన్ పెద్ద మోసగాడు’..

152

ఏంటిదీ..ఇన్నాళ్ళూ పవన్‌ కళ్యాణ్‌ నిజాయితీపరుడని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడని సినిమా ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. కానీ ఇలా పవన్‌ ని మోసగాడు అంటున్నారేంటీ..? అనుకుంటున్నారా? మరి ఇందులో ఏది నిజమో..ఇప్పటికీ పవన్‌ ఫ్యాన్స్‌ కి ఈ విషయం అర్థంకావడంలేదు. అసలు పవన్‌ ని పచ్చిమోసగాడని ఎవరన్నారు? అసలు పవన్‌ చేసిన మోసమేంటి? అనే వివరాల్లోకెళితే.. పవన్‌ వల్ల నష్టపోయిన వారు చాలా మందే ఉన్నారని వారిని మాత్రం పవన్‌ పట్టించుకోవడం లేదని…
Kamaal R Khan Says Pawan kalyan is Big Cheater
పవన్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు ఓ నటుడు.  `ప‌వ‌న్ ఓ పెద్ద మోస‌గాడు.. ఫ్లాప్ హీరో.. అలాంటి హీరో న‌టించిన `కాట‌మ‌రాయుడు`ని హిందీలో రిలీజ్ చేస్తారా?“ అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు ఆ బాలీవుడ్ న‌టుడు. సినీవిమ‌ర్శ‌కుడు క‌మాల్ ఆర్‌.ఖాన్‌. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల డిస్ట్రిబ్యూట‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. 8 కోట్ల మేర ప‌వ‌న్ మోసం చేశాడ‌ని క‌మాల్ ఆరోపించ‌డం టాలీవుడ్లో సంచ‌ల‌న‌మైంది. అస‌లు ప‌వ‌న్ ఎలా మోస‌గాడ‌య్యాడు? అని ఆరాతీస్తే..?
 Kamaal R Khan Says Pawan kalyan is Big Cheater
స‌ర్ధార్ న‌ష్టాల్ని తీర్చేందుకు పంపిణీదారుల‌కు `కాట‌మ‌రాయుడు` హ‌క్కుల్ని ఇస్తామ‌ని హామీ ఇచ్చి తీరా రిలీజ్ ముందు ప‌వ‌న్‌, శ‌ర‌త్‌మ‌రార్‌ హ్యాండిచ్చార‌ని .. న‌ష్ట‌పోయిన‌వారంతా ఫిలింన‌గ‌ర్‌లో నిరాహార దీక్ష చేప‌డుతున్నార‌ని, వారిని ఆదుకోవ‌డంలో ప‌వ‌న్ విఫ‌ల‌మ‌య్యాడ‌ని క‌మాల్ ఖాన్ ఆరోపించారు.

అయితే..ఇటీవ‌ల స‌ర్ధార్ బాధితులు రెగ్యుల‌ర్‌గా ప‌వ‌న్‌ని, శ‌ర‌త్‌మ‌రార్‌ని దీక్షల‌తో వెంబ‌డిస్తున్న క్రమంలో క‌మాల్ ఖాన్ వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపాయి. ఏపీలో `సర్దార్ గబ్బర్ సింగ్‌` వల్ల రూ. 2 కోట్లు నష్టపోయిన ఓ పంపిణీదారుడు గత 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడంటూ ఓ ఫొటోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు క‌మాల్‌ఖాన్‌. మరి  ఇంత జరుగుతున్నా..ఈ వార్తలపై పవన్‌ స్పందిస్తాడో లేదో చూడాలి.