అల..వైకుంఠపురంలో.. బుట్టబొమ్మ వీడియో సాంగ్

560
butta-bomma
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె హీరోయిన్ గా నటించిన ఈచిత్రానికి తమన్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని బ్యానర్లపై ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈమూవీ ట్రైలర్ ను ఇటివలే విడుదల చేశారు చిత్రయూనిట్. ఈట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక ఈమూవీ పాటల గురించి చెప్పుకోనవసరం లేదు.

అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్ గా నిలిచింది. యూట్యూబ్ లో 100మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. సామ‌జ‌వ‌ర‌గ‌మనా, రాములో రాములా, ఓ మై గాడ్ డాడీ, బుట్ట‌బొమ్మ‌ అనే సాంగ్స్ కి ఎంత మంచి రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా బుట్టబొమ్మ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్, పూజా స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. స్టైలిష్ డ్యాన్స్ తో బన్నీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, ఆర్మాన్ మాలిక్ పాట పాడారు.

- Advertisement -