ఇక నుండి నేనేంటో చూపిస్తా.. బన్నీ వీడియో వైరల్‌..

19
Allu Arjun

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వైవిధ్య‌మైన చిత్రాలు చేసిన బ‌న్నీ ఎన్నో మంచి విజ‌యాలు సాధించాడు. ఇకపోతే గత ఏడాది వచ్చిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం బ‌న్నీ కెరియ‌ర్‌లో ఆల్‌ టైం రికార్టుగా నిలిచింది. అలానే ఈ సినిమాలో బ‌న్నీ స్టైలిష్ డ్యాన్స్‌కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక పాటల విషయనికొస్తే ఇందులో ప్రతి పాట రికార్డును క్రియేట్ చేశాయి. బుట్ట బొమ్మ సాంగ్ ఇంకా రికార్డులు తిరగరాస్తూనే ఉంది. కాగా, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం విడుద‌లై ఏడాది పూర్తైన సంద‌ర్భంగా సోమ‌వారం రాత్రి రీయూనియ‌న్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్ హాజ‌ర‌య్యారు.

ఈ వేడుకలో హీరో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఇంత బాగా సక్సెస్‌ చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్‌ల‌కు ఆల్ టైం రికార్డ్ రావ‌డానికి ఏడు సినిమాల ప‌డితే నాకు 20 సినిమాలు ప‌ట్టింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ఇక నుండి నేనేంటో చూపిస్తానంటూ బ‌న్నీ తెలిపారు. ఇక స్టైలిష్‌స్టార్‌పై ప్రేమ‌తో థ‌మ‌న్ ప్ర‌త్యేక వీడియో రూపొందించి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. జ‌ర్నీ ఆఫ్ అల్లు అర్జున్ పేరుతో రూపొందిన ఈ వీడియో విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

Allu Arjun Speech @ Ala Vaikunthapurramuloo Reunion | Pooja Hegde | Trivikram | Thaman S
Journey of Stylish Star Allu Arjun | #AlluArjunRAPSong | A Thaman S Musical