‘గుణ 369’నుండి లిరికల్‌ సాంగ్ వచ్చేసింది..

656
Guna 369
- Advertisement -

టాలీవుడ్‌ హీరో, ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ‌ హీరోగా నటించిన తాజా చిత్రం `గుణ 369`. ఈ చిత్రంలో అనఘ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు.

guna

 

“కలలో కూడా కష్టం కదే ఈ హాయి .. కథ మొత్తం తిప్పేశావే అమ్మాయి .. వదలకుండా పట్టుకుంటా నీ చేయి .. నువ్వు అట్టా నచ్చేశావోయ్ అబ్బాయి” అంటూ ఈ పాట సాగుతోంది. మేకింగ్ షాట్స్ ను బట్టి ఈ పాటను హీరో హీరోయిన్స్‌పై చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. నాయకా నాయికలు ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమను వ్యక్తం చేసుకునే భావజాలంతో ఈ పాటను ఆవిష్కరించారు. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన బాణీ కొత్తగా అనిపిస్తోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం .. నకష్ అజీజ్ – దీప్తి పార్థసారధి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, భాను, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్ : స‌త్య కిశోర్‌, శివ మల్లాల.

- Advertisement -