CMKCR:తెలంగాణ ప్రజల ఆకాంక్షల నిర్మాణం

25
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 5నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అంతార్జతీయ అవార్డులు దక్కించుకోవడం పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక గ్రీన్ ఆర్గనైజేషన్ అవార్డులను ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇందులో డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పోలీస్ కమాండర్ కంట్రోల్ సెంటర్‌, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మొజంజాహీ మార్కెట్‌లు ఇంటర్‌నేషనల్‌ బ్యూటీఫుల్‌ బిల్డింగ్‌ గ్రీన్ యాపిల్ అవార్డులు గెలుచుకోవడం గొప్ప విషయమన్నారు. దేశంలో మొదటి సారిగా ఈ గ్రీన్ అవార్డులు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డులను దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ద్వారా తెలంగాణతో పాటు భారతదేశ ఖ్యాతి ఇనుమడించిందని సీఎం తెలిపారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రపంచస్థాయి ప్రమాణాలతో పర్యావరణ నియమాలకు అనుగుణంగా తెలంగాణలో నూతన కట్టడాల నిర్మాణం, పునరుద్దరణ జరుగుతుందని సీఎం అన్నారు. తెలంగాణ ఆచరిస్తున్న ప్రగతి దారులను దేశం అనుసరిస్తున్నదన్నారు.

Also Read: CM KCR:నిమ్స్‌కు శంకుస్థాపన

ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు తెలంగాణకు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ నెల 16 న లండన్ లో ఈ అవార్డులను తెలంగాణ రాష్ట్రానికి అందచేయనున్న సందర్భంగా, ఇందుకు కృషి చేసిన ఆయా శాఖల మంత్రులను, ఉన్నతాధికారులను, సిబ్బందిని సిఎం కేసీఆర్ అభినందించారు.

Also Read: CMKCR:వైద్యరంగంపై విమర్శలే ఎక్కువ..ప్రశంసలు తక్కువ

- Advertisement -