2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ . బడ్జెట్ లో మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లు అని వెల్లడించారు. వ్యవసాయం, సొంత ఇల్లు లేని వారికి అదేవిధంగా వేతన జీవులకు ఐటీ ట్యాక్స్‌కు సంబంధించి పెద్ద ఎత్తున ఊరట కల్పించారు.
ఇక పీఎం ఆవాస్ యోజన పథకానికి బడ్జెట్ లో నిధులు భారీగా పెంచింది. గతేడాది ఈ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని 66శాతం పెంచింది. ప్రస్తుత బడ్జెట్ లో రూ.79వేల కోట్లు కేటాయించింది.
()5జీ సేవల యాప్ ల అభివృద్ధి కోసం 100 పరిశోధనా సంస్థలు
()ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు
()ఎంఎస్ఎంఈలు, ఎన్జీవోలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ
()కాలం చెల్లిన వాహనాల తొలగింపునకు తక్షణ ప్రాధాన్యత
()కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు
()కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు కూడా సాయం
()నీతి ఆయోగ్ మరో మూడేళ్ల పాటు పొడిగింపు
()పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు
()వ్యవసాయ రుణాల కోసం రూ.20 లక్షల కోట్లు
()ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం
()సికిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు
()నేషనల్ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు ప్రోత్సాహం
()గిరిజనుల కోసం పీవీటీజీ పథకం ఏర్పాటు
()శ్రీ అన్నపథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం
()పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం
()ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత
()గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు
()వ్యవసాయ స్టార్టప్ ల ప్రోత్సాహనికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు
()వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులను సేంద్రియ సేద్యం వైపు మళ్లింపు
()రైతుల కోసం 10 వేల బయో ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాల ఏర్పాటు
()దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్
()పరపతి సంఘాల డిజిటలైజేషన్ కు రూ.2 వేల కోట్లు
()రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
()రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు
()రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు
(02013-14తో పోల్చితే రైల్వేలకు 9 రెట్లు అధికంగా నిధులు
()కీలకమైన 100 మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
()ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు
()ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం
()పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు
ఇవి కూడా చదవండి..