ఖమ్మంలో ప్రేమోన్మాది ఘాతుకం..

595
khammam love
- Advertisement -

ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో అమ్మాయిని వంచించి దారుణంగా హత్యచేసి పారిపోయాడు. రెండు రోజులైన తమ కూతురు ఇంటికి రాకపోవడంతో అనుమానంతో గాలింపు చేపట్టగా అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు ఆ తల్లిదండ్రులు.

వివరాల్లోకి వెళ్తే…పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని డిప్లమా చేసిన తేజస్వినిని నితిన్ ఇద్దరు ప్రేమించుకున్నారు.ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు కుటుంబసభ్యులు.

అయితే తేజస్విని తనను ప్రేమిస్తూనే తన బంధువు అయిన మరోకరిని కూడా ప్రేమిస్తుందనే అనుమమానంతో ఆదివారం రాత్రి లంకపల్లి గ్రామంకు ఆమెను తీసుకొచ్చారు నితిన్. అక్కడ ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో తేజస్విని హత్యచేసి ఏమి తెలియనట్లు ఖమ్మం పారిపోయి అక్కడ ఎస్‌ఎమ్‌ఎస్ హాస్టల్‌లో తలదాచుకున్నాడు.

రెండు రోజులుగా తమ అమ్మాయి కనబడక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. వీరి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా లంకపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతుదేహం లభ్యమైంది. ఆ మృతదేహాం తేజస్వినిదిగా గుర్తించడంతో ఆరా తీయగా ఆమెను హతమార్చింది నితిన్‌గా ప్రాధమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు. నిందితుడు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తేజస్విని హత్యతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

- Advertisement -