భారతదేశానికి దిక్సూచి తెలంగాణ:కేటీఆర్‌

62
- Advertisement -

బీజేపీ ఉచ్చులో యువత పడొద్దు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. దేశంలో మతాల మధ్య పంచాయతీ పెట్టి సొమ్ము చేసుకుంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కిష‌న్ రెడ్డి లాంటి స‌న్నాసి నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడుతున్నాడు. ఆయ‌న మాట్లాడేవ‌న్ని అబద్ధాలు.. నిల‌దీస్తే ఒక్క స‌మాధానం కూడా చెప్ప‌డ‌ని మండిప‌డ్డారు. హుజుర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ ఉందని అన్నారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశం కాపీ కొడుతుందని మండిపడ్డారు. రూ. 30 వేల కోట్ల‌తో దామ‌ర‌చ‌ర్ల‌లో అల్ట్రా మెగా వ‌ప‌ర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వం అని స్ప‌ష్టం చేశారు. ఇవాళ‌ ఇంటింటికి సీఎం కేసీఆర్ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు.

తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగు పడ్డాయి. భారతదేశంలోనే తెలంగాణా గ్రామ పంచాయ‌తీలు గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయని తెలిపారు. టీఆర్ఎస్‌ బీఆర్ఎస్‌గా మారిందన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురారు కానీ అబద్దాలు మాత్రం మాట్లాడుతూ ఉంటారని దుయ్యబట్టారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చ గొట్టి పబ్బం గడుపుకోవాలని కుట్రలు చేస్తున్న బీజేపీపై మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి…

హుజూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

కాంగ్రెస్‌కు షాక్.. బి‌ఆర్‌ఎస్ లోకి 12 మంది!

ఏపీ బీజేపీ గ్రూప్ వార్.. !

- Advertisement -