Harish Rao:బీఆర్ఎస్‌కు 100 సీట్లు

36
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 90 నుండి 100 సీట్లు రావడం ఖాయమని చెప్పారు మంత్రి హరీశ్ రావు. నారాయణఖేడ్‌ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన హరీశ్‌..టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. తాజా సర్వే రిపోర్టులలో ఈ విషయం తేలిందని, బీజేపీ పెట్టే ఇబ్బందులను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విక్టరీ కొడుతుందన్నారు.

కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష లాంటిదని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ మత హింసను సృష్టిస్తోందని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాన నగరాలకు కూడా తాగునీటి సౌకర్యం లేదని, కానీ తెలంగాణలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు.

మోదీ ప్రభుత్వం అదానీని ధనవంతుడిగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని, కానీ కేసీఆర్ సర్కార్ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని హరీష్ పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -