దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు కార్యాచరణను వేగవంతం చేశారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా తొలుత ఏపీ, కర్ణాటకలపై దృష్టి సారించగా తాజాగా బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగసభకు ప్లాన్ సిద్ధమైంది. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. జాతీయ స్ధాయిలో విపక్షాల ఐక్యతను చాటేందుకు ఖమ్మం బహిరంగసభను వేదికగా చేయనున్నారు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్.
ఈ భారీ బహిరంగసభకు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరుకానున్నారు. అలాగే వివిధ పార్టీల జాతీయస్థాయి నేతలు హాజరుకానున్నారు.
ఖమ్మం జిల్లా ఏపీకి సరిహద్దుగా ఉండటం కూడా సభ కోసం ఈ జిల్లాను ఎంచుకోవడానికి కారణమని సమాచారం. ఈ సభ ద్వారా ఏపీ ప్రజలకు కూడా సీఎం కేసీఆర్ తన సందేశాన్ని వినిపించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవశ్యకత, రైతులకు చేయబోయే కార్యక్రమాల ఎజెండాను రైతుల ఎదుట వెల్లడించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..