తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఎన్నికలకు పట్టుమని మూడు నెలల సమయమే ఉండడంతో బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో కసరత్తులు మొదలు పెట్టాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుందో అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే అధినేత కేసిఆర్ తేల్చి చెప్పారు. అలాగే ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న వారికి సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారు. ఇక కొందరు అవినీతికి పాల్పడుతున్నారని వారు జాగ్రత్తగా నడుకూచుకోవాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరిని బహిరంగంగానే హెచ్చరించారు కేసిఆర్. .
దీంతో ప్రస్తుతం ఉన్నసిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరెవరికి సీట్లు దక్కుడతాయనే చర్చ జోరుగా సాగుతోంది. కాగా బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితా ను కేసిఆర్ ఇప్పటికే రెడీ చేసినట్లు వినికిడి. కాగా కేసిఆర్ మొదటి లిస్ట్ లో దాదాపు 95 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద 112 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించినట్లు వినికిడి. మిగిలిన 7 స్థానాల్లో కొత్తవారిని బరిలో దించే ఆలోచనలో ఉన్నారట అధినేత కేసిఆర్.
ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ వంటి జిల్లాలలో అక్కడక్కడ అభ్యర్థుల మార్పు చేయనున్నడట. ఒకరిద్దరు మినహా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరిపై ప్రజలు సానుకూల భావంతోనే ఉన్నట్లు సర్వేల రిపోర్ట్ అందాయట. అందుకే అభ్యర్థుల విషయంలో పెద్దగా మార్పులేవీ చేయకుండా ఎన్నికల బరిలో నిలవాలని సికేఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మరి మూడోసారి కూడా అధికారం దిశగా అడుగులు వేస్తున్న బిఆర్‌ఎస్ పార్టీకి బరిలో నిలిచే అభ్యర్థులు తేలే సమయం ఎంతో దూరంలో లేదనే చెప్పాలి.
Also Read:అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్!