జగన్ ప్రత్యర్థి షర్మిల.. ఇద్దరికీ నష్టమేనా ?

27
- Advertisement -

వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నాట్లు గత కొన్నాళ్లుగా తరచూ వినిపిస్తున్న మాట. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలన్నీ తుది దశకు చేరుకున్నాట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ విలీనంపై త్వరలోనే అధిస్థానంతో షర్మిల చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లోగా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందట. కాగా తెలంగాణ పాలిటిక్స్ లో షర్మిల కొనసాగాలని చూస్తున్నప్పటికి కాంగ్రెస్ అధిస్థానం మాత్రం ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాద్యతలు అప్పగించేందుకే ఆసక్తి చూపిస్తోందట. దాంతో షర్మిల కూడా అధిష్టానం ఆదేశానికే తలోగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్. ఇక ఏపీలో షర్మిల కాంగ్రెస్ బాద్యతలు చేపటితే తన అన్న జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా ఉండాల్సి వస్తుంది.

మరి జగన్ కు షర్మిల ప్రత్యర్థి అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇద్దరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతానంగా ప్రజల్లో మంచి ఆధారణ ఉంది. గతంలో వైఎస్ఆర్ పార్టీ తరుపున షర్మిల పాదయాత్ర ఆ పార్టీకి ఎంత మైలేజ్ తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తమదైన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోవడంలో జగన్ మరియు షర్మిల సమవుజ్జీలుగా నిలుస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జగన్ కు షర్మిల ప్రత్యర్థి అయితే జగనే ఎక్కువ నష్టం అని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌కు మీరే రోల్ మోడల్స్:ఎంపీ సంతోష్

ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ లో భారీగా చీలిక ఏర్పడి షర్మిల వైపు మల్లె అవకాశం ఉంది. దాంతో వైసీపీకి ఓటు షేర్ తగ్గుతుంది. అలాగని షర్మిల రాకతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బలపడి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ ఉందనే విషయాన్ని కూడా చాలమంది మర్చిపోయారు. అందువల్ల ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే అటు జగన్ ఇటు షర్మిల ఇద్దరు నష్టపోయే అవకాశాలే ఎక్కువ అని చెబుతున్నారు కొందరు విశ్లేషకులు. కానీ ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే టీడీపీ మరియు జనసేన పార్టీలకు మేలు జరుగుతుందనేది కొందరి అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:రిపబ్లికన్ అభ్యర్థిగా వివేక్ రామస్వామి!

- Advertisement -