తెలంగాణ గళం, బలం.. బి‌ఆర్‌ఎసే!

15
- Advertisement -

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటికి మెజారిటీ ప్రజలు బి‌ఆర్‌ఎస్ వెంటే ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బి‌ఆర్‌ఎస్ మద్య ఓటు షేర్ కేవలం 1.87 శాతం తేడా మాత్రమే ఉండడాన్ని గమనిస్తే.. ప్రజలు బి‌ఆర్‌ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారనే సంగతి స్పష్టంగా అర్థమౌతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బి‌ఆర్‌ఎస్ పాత్ర ఎంతో ముఖ్యమైనది. కేంద్రంతో కోట్లాడి రాష్ట్ర సాధనకు బాటలు వేసిన ఘనత బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ కు మాత్రమే దక్కుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల బలం, గళం కేవలం బి‌ఆర్‌ఎస్ పార్టీనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ ఇదే విషయాన్ని వ్యాఖ్యానిస్తూ.. తెలంగాణ ప్రజల ఏకైక గొంతుక బి‌ఆర్‌ఎస్ పార్టీనే అని అన్నారు. .

2014 లో ప్రజల పక్షాన నిలిచిన బి‌ఆర్‌ఎస్.. 2024 లోనూ ప్రజా గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రజల బలం, గళం, దళం బి‌ఆర్‌ఎస్ పార్టీ మాత్రమే అని తనదైన రీతిలో కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర గళం కేంద్రంలో వినిపించేందుకు ప్రజా మద్దతు బి‌ఆర్‌ఎస్ కు అవసరమని ఆయన అన్నారు. రాబోయే రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలకు గాను గత ఎన్నికల్లో 9 స్థానాల్లో విజయం సాధించింది బి‌ఆర్‌ఎస్ పార్టీ. ఈసారి అంతకు మించి సీట్లు సాధించాలని బి‌ఆర్‌ఎస్ పట్టుదలగా ఉంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై పథకాల అమలు విషయంలోనూ, వాటికి విధిస్తున్న షరతుల విషయంలోనూ అడపా దడపా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బి‌ఆర్‌ఎస్ కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.

Also Read:మహిళల్లో సంతాన సమస్యలు తగ్గాలంటే..?

- Advertisement -