బ్రిటన్ ప్రధాని ఎవరో తేలేది నేడే!

119
pm
- Advertisement -

బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బ్రిటన్ లో ఎన్నికలు అనివార్యం కాగా ఇవాళ నూతన ప్రధాని ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెలువడనుండగా బ్రిటీష్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ మధ్య హోరాహోరి పోరు జరిగింది.

అయితే సర్వేల అంచనాల ప్రకారం ట్రస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుండగా కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది క్రియాశీల సభ్యులు.. ఆగస్టు నెల నుంచి పోస్ట్‌ ద్వారా, ఆన్‌లైన్‌లోనూ ఈ నెల 2వ తేదీ వరకు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

- Advertisement -