ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ ‘నాయక్’ను రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. వి వి వినాయక్ దర్శకత్వంలో 2013లో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించి అదరగొట్టాడు. కాకపోతే.. ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులను బ్రేక్ చేయలేక పోయింది.
మరి ఇలాంటి సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్స్ వస్తాయా ?, నిజానికి రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ చేశారు. మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. కానీ రెండో రోజు నాటికి జీరో కలెక్షన్స్ వచ్చాయి. దాంతో.. సినిమాని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మరి నాయక్ పరిస్థితి కూడా అంతే కదా. అయినా, మెగాస్టార్ బర్త్ డే కానుకగా మెగాస్టార్ నటించిన హిట్ సినిమాను రిలీజ్ చేస్తే బెటర్ గానీ, రామ్ చరణ్ నటించిన సినిమాని రిలీజ్ చేస్తే ఏం ఉపయోగం ?.
బహుశా ఇదే ఆలోచన మెగా సన్నిహితుల్లో కూడా కలిగినట్లు ఉంది. అందుకే.. నాయక్ సినిమా రీరిలిజ్ ఆపాలని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే నాయక్ మేకర్స్ కూడా ఈ రీరిలీజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథాకథనాలపై అప్పట్లో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు అయితే ఆ కామెంట్లు మరీ ఎక్కువ అవుతాయి. బహుశా అందుకే.. మెగా కాంపౌండ్ కూడా ఈ సినిమా రీరిలీజ్ ను అపేయమని చెప్పింది.
Also Read:Kavitha:బీఆర్ఎస్..మన ఇంటి పార్టీ