కరోనాతో ఒక్కరోజే 3,251 మంది మృతి..

194
brazil
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తోంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ కొనసాగుతుండగా మరికొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కొనసాగుతోంది. ఇక భారత్‌లో సెకండ్ వేవ్ కొనసాగుతుండగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

ఇక ప్రపంచంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఆ దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండగా మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. గత 24 గంటల్లోనే బ్రెజిల్‌లో 3,251 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధిక కేసులు, మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు బ్రెజిల్‌లో 12,227,179 కరోనా కేసులు నమోదుకాగా 3,01,087 మంది మృతిచెందారు.

- Advertisement -