రివ్యూ: బ్రాండ్ బాబు

277
Brand Babu review
- Advertisement -

సుమంత్ శైలేంద్ర హీరోగా ఇషా రెబ్బా హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం బ్రాండ్ బాబు. దర్శకుడు మారుతి ఈ సినిమాకు కథ అందించగా ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శైలేంద్ర బాబు నిర్మించగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. దర్శకుడిగా తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకువచ్చిన ప్రభాకర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…

కథ :

డైమండ్ బాబు (సుమంత్ శైలేంద్ర) హై క్లాస్ అబ్బాయి. తాను వాడే ఏ వస్తువైనా బ్రాండెడే. తాను చేసుకోబోయే అమ్మాయి స్టేటస్ వల్ల తన బ్రాండ్ ఇంకా పెరగాలనుకుంటాడు. కానీ అనుకోని కారణాల వల్ల హోమ్‌ మినిస్టర్ కూతురు(పూజిత పొన్నాడా) ప్రేమిస్తుందని అనుకుంటాడు. ఈ క్రమంలో హోమ్ మినిష్టర్ కూతురికి బదులు ఆ ఇంటిలోని పనిమనిషి (ఈషా
రెబ్బ)ను ప్రేమలో పడతాడు. సీన్ కట్ చేస్తే తాను ప్రేమించింది హోమ్ మినిస్టర్ కూతురుని కాదని తెలుసుకుని నిశ్చితార్ధం క్యాన్సల్ చేసుకుంటాడు…? తర్వాత ఏం జరుగుతుంది..?బ్రాండ్ పిచ్చి ఉన్న డైమండ్ బాబా మారాడా..?కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.

Image result for brand babu

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. బ్రాండెడ్ అనే కాన్సెప్ట్‌తో చిన్న కథని తెరకెక్కించాడు ఈటీవీ ప్రభాకర్. తొలిసినిమానే అయినా హీరో సుమంత్ శైలేంద్ర బ్రాండ్ బాబు పాత్రలో ఇమిడిపోయాడు. డ్యాన్స్,ఎమోషనల్ సీన్స్‌లో అద్భుత నటన కనబర్చాడు. సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది ఈషా రెబ్బ. హీరో,హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్. బ్రాండ్ బాబు
ఫాదర్ గా మురళి శర్మ ఆకట్టుకున్నారు. కమెడియన్ సత్యం రాజేష్,వేణు, సాయి కామెడీ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ స్లో నేరేషన్‌,పస లేని సీన్లు. మంచి కాన్సెప్ట్‌తో వచ్చినా చివరివరకు దానికి కంటిన్యూ చేయడంలో దర్శకుడు విఫలమయ్యారు. సినిమాలోని ఆసక్తిని పెంచే సన్నివేశాలను రాసుకోవటానికి స్కోప్ ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సినిమాను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది.జేబీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. శైలేంద్ర బాబు నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు :

మారుతి సినిమాలంటే ఓ బ్రాండ్. అలాంటి మారుతి కథ అందించిన చిత్రం బ్రాండ్ బాబు. కామెడీ,ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్ కాగా స్లో నేరేషన్ సినిమాకు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే మూవీ బ్రాండ్ బాబు.

విడుదల తేదీ:03/08/2018
రేటింగ్:2.5/5
నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ
సంగీతం : జేబీ
నిర్మాతలు : శైలేంద్ర బాబు
దర్శకత్వం : ఈ టీవీ ప్రభాకర్

- Advertisement -